ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని, వీటిపై అపోహలు అక్కర్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈసీ హైదరాబాద్లో కార్యశాల నిర్వహించింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగం, చెల్లింపు వార్తలు, ఐటీ అప్లికేషన్స్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఖర్చులపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు.
శాసనసభ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు.
ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల నిర్వహణలో విరివిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి అమ్రపాలి తెలిపారు.