ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీతో ప్రమాదం పొంచి ఉందని వామపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని చాడ తెలిపారు. కేరళ తరహా తీర్మానం చేసి అమలు చేయబోమని ప్రభుత్వం చెప్పాలని ఆయన అన్నారు.
ఎన్‌పీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా రాజ్యాంగ పదవుల్లో ఉండి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తామన్నారు. భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 23న సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కరోనా: ఈ సూచనలు పాటించండి.. తారక్, చరణ్ వినతి