ETV Bharat / state

ఫెయిలైతే డ్రైవర్లు కావొచ్చంటారా: అఖిల పక్షం

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు ఇంత కష్టం వచ్చిందన్నారు అఖిలపక్షనేతలు. గ్లోబరీనా వద్దని వారించినా బోర్డు.. ఏ మాత్రం ఖాతరు చేయలేదని మండిపడ్డారు. ఫెయిలైతే డ్రైవర్లో, మరింకేదో కావొచ్చని బోర్డు సభ్యులు మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు.

అఖిల పక్షం
author img

By

Published : Apr 27, 2019, 2:03 PM IST

ఇంటర్ బోర్డులో అవకతవకలపై సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ జరిగింది. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, తెతేదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెదేపా నేత రావుల, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

అఖిల పక్షం

ఫిబ్రవరి నుంచే సాప్ట్​వేర్ సమస్యలు

ఫిబ్రవరి నుంచే గ్లోబరీనా సాఫ్ట్​వేర్​లో సమస్యలు వెలుగు చూశాయని నేతలు ఆరోపించారు. ప్రాక్టికల్​ మార్కులు సరిగ్గా ఎంట్రీ కాలేదని కళాశాలల యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన టెక్నాలజీ లేని సంస్థగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గ్లోబరీనాను రద్దు చేసినా... మళ్లీ దానికే ఫలితాల బాధ్యత అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు.

ఎల్లుండి అఖిలపక్షం ధర్నాకు రావాలని పిలుపు

ఈ నెల 29న ఇంటర్​ బోర్డు వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాకు అందరూ రావాలని నేతలు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ప్రతిరోజు రీకౌంటింగ్​, రీ వెరిఫికేషన్​పై బులెటిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.