దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని తెజస అధ్యక్షుడు కోదండరామ్ (kodandaram) ఆరోపించారు. హరితహారంలో 240కోట్ల మొక్కలు నాటినట్లు కేటీఆర్ చెబుతున్నారని... ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు(tpcc working president mahesh kumar goud). కేసీఆర్ మాట మీద నిలబడతాడరి తమకు నమ్మకం లేదన్నారు. సబ్‌కమిటీ పేరుతో కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (thammineni veerabhadram) విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పోడు రైతులకు పట్టాలిచ్చి గౌరవం కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు సాగుదారుల మీద దాడులు పెరిగాయని చాడ వెంకట్ రెడ్డి (chada venkat reddy) ఆరోపించారు. హరితహారం (haritha haram) పేరుతో పోడు సాగుదారులకు ఉరి తాళ్లు బిగించారని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2006 చట్టం అమలుకు కార్యాచరణ కావాలని మేము డిమాండ్ చేశాము. 2005 డిసెంబర్ 13 తర్వాత అర్హులకు కూడా ఇవ్వడానికి గవర్నమెంటు సిద్ధమై కేంద్ర ప్రభుత్వంతో ఆ చట్ట సవరణలకు చేసే ఏ ప్రయత్నాలకైనా తప్పనిసరిగా ప్రయత్నాలు కొనసాగాల్సిందేనని మేము అడిగాం. ఈ రెండు అంశాలు లేకుంటే మాత్రం ఈ తీర్మానం సమగ్రం కాదు. అట్లాంటిది మాకు ఆమోద యోగ్యంగా ఉండదు. -ప్రొఫెసర్ కోదడరాం, తెజస అధ్యక్షుడు.
ఇవాళ అసెంబ్లీలో మేము పోడు భూములకు మద్దతు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారంటే.. దానిపై ఈనెల 5న జరిగిన అకిలపక్షం నిరసన ప్రభావం ఎంతైనా పడింది. కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదు. అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన ఆ మాటపై నిలబడతాడని మాకెవ్వరికీ నమ్మకం లేదు. గతంలో కూడా ఎన్నో మాటలు చెప్పి వాటిని విస్మరించిన ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. -మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు దాదాపు నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం డిమాండ్ చేశారు. పోడు రైతులు ఈ కదలికి చూసి ఏడేళ్లపాటు ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వనటువంటి కేసీఆర్ సర్కారు స్పందించక తప్పలేదు. -తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.
పోడు అంశమనేది పోడు సాగుదారుల బతుకుకు సంబంధించినది. ఆ భూమి లేకపోతే వాళ్లకు జీవనాధారం లేదు. పోడు సాగుదారులపై గతంలో కూడా ప్రభుత్వాలు దాడులు చేశాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దారుణంగా, దుర్మర్గంగా, అణచివేస్తూ, కోట్లాది రూపాయల పంటలను ధ్వంసం చేశారు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. -చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.
ఇదీ చూడండి: ALL PARTY PROTEST: పోడు రైతులపై అఖిల పక్షం ఉద్యమం.. పలుచోట్ల రహదారుల దిగ్బంధం