ఏప్రిల్ 14న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని మక్తుం భవన్లో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రాజకీయ, మైనార్టీ, ప్రజా సంఘాల ఐకాస తెలిపింది. బాబా సాహెబ్ అంబేడ్కర్ జన్మదినం రోజున పెద్ద ఎత్తున సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని ఐకాస నాయకులు సూచించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్య పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా... కార్యాచరణలోకి రావడం లేదన్నారు. ఇందుకోసం శాసన సభ, శాసన మండలి అధ్యక్షులను కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పల్లె ప్రగతి మంచి కార్యక్రమం: జీవన్ రెడ్డి