మూడు సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని విమర్శించారు. భారత్ బంద్ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లి నుంచి నారాయణగూడ వైఎంసీఏ వరకు వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు.
ఈ ఆందోళనల్లో వామపక్షాల నేతలు కె.నారాయణ, వేములపల్లి వెంకటరామయ్య తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతినిధులు, శ్రేణులు కదం తొక్కుతూ ముందుకు సాగాయి. పలువురు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: బడినే బార్‌గా మార్చేసిన ఉపాధ్యాయుడు