హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ నాయకులు సంపత్‌కుమార్, పొన్నం ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, రైతు సమస్యలు, కొవిడ్‌పై నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వంటి పలు విషయాలపై అఖిలపక్ష నాయకులు చర్చించనున్నారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష