ఆల్ ఇండియా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ముంబయిలో జరిగే ప్లాస్టివిజన్ ఇండియా 2020 ఎగ్జిబిషన్ షోకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని.. కానీ ప్రత్యామ్నాయాలు చూపెట్టాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ మొత్తం ఉత్పత్తిలో మూడున్నర నుంచి నాలుగు శాతం మాత్రమే ఉందని కో-ఛైర్మన్ మీలా జయదేవ్ అన్నారు. ప్లాస్టివిజన్లో రిసైక్లింగ్పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జనవరి 16 నుంచి 20 వరకు ప్లాస్టివిజన్ ఇండియా 2020ఎగ్జిబిషన్ షో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదని.. 35 దేశాల నుంచి మొత్తం 2.5 లక్షల మంది వస్తారని చెప్పారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం