ETV Bharat / state

'కావాలనే రుణాలు చెల్లించడం లేదు... మీరే చర్యలు తీసుకోవాలి'

బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని... ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడుతున్న వారిపట్ల చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని... అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు వివరాలను వెల్లడించింది.

all-india-bank-employees-on-bank-will-full-defaulters
'కావాలనే రుణాలు చెల్లించడం లేదు... మీరే చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Jul 19, 2020, 10:03 AM IST

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం విడుదల చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని... చెల్లించని బాకీలు సుమారు 8లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్లు సంఘం తెలుగు రాష్ట్రాల కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ఈ వివరాలు కేవలం చెల్లించే స్థోమత ఉండి కూడాఎగవేతకు పాల్పడిన వారివేనని స్పష్టం చేశారు.

దీనిలో అయిదు కోట్లు అంతకంటే ఎక్కువ బకాయి కలిగిన బ్యాంకులు 17 ఉండగా... 2,426 సంస్థలు ఆ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి మొత్తం లక్షా 47వేల కోట్ల రూపాయలు అని తెలిపారు. అత్యధికంగా భారతీయ స్టేట్‌ బ్యాంకు ఉద్దేశ పూర్వక ఎగవేతదారులను కలిగి ఉండగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆ తరువాత స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సంస్థలన్నీ కూడా రుణాలు చెల్లించే స్థోమత కలిగినవే కాబట్టి... బాకీ వసూలుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే బ్యాంకులకు కొంతైనా ఆర్థిక ఊరట కల్గుతుందని రాంబాబు తెలిపారు.

'కావాలనే రుణాలు చెల్లించడం లేదు... మీరే చర్యలు తీసుకోవాలి'

ఇదీ చూడండి: అనుబంధాలనూ వదలని మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.