రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు.
వెబ్సైట్లో హాల్ టికెట్లు..
ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీలో 12 వేల 700 సీట్లను భర్తీ చేయనున్నట్లు మల్లయ్య తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం కోసం 41 వేల 447 మంది.. డిగ్రీలో ప్రవేశం కోసం 5 వేల 367 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులకు హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే 040 -23328266 కి ఫోన్ చేయాలని సూచించారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయి. ఇక్కడ సీటు సాధిస్తే చాలు మంచి మార్కులు సాధించవచ్చనే భరోసా చాలా మంది విద్యార్థుల్లో నెలకొంది.
ఇదీ చూడండి: