కొవిడ్ - 19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయ మార్గం చూపాల్సిన అవసరం ఉందని దేవి థియేటర్ యజమాని బాల గోవింద్ రాజ్ విన్నవించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని థియేటర్ల ఆధ్వర్యంలో.. కేక్ కట్ చేసి జన్మదిన వేడుక జరుపుకున్నారు.. అనంతరం అక్కినేని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ఆధ్వర్యంలో.. సినిమా థియేటర్ల సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
మహమ్మారి కారణంగా థియేటర్ల సిబ్బంది పరిస్థితి దీనంగా మారిందని.. వారికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో తమకు తోచిన సాయం అందిస్తున్నామని అక్కినేని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: అమాయకులే లక్ష్యం.. రూ. లక్షలు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు!