ETV Bharat / state

AIR PASSENGERS: క్రమంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు.. అదేకారణం - విదేశీ ప్రయాణికులు పెరుగుతున్నారు

కొవిడ్ సెకండ్​ వేవ్ అనంతరం దేశీయ విమాన ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య పెరగడం, వివిధ రాష్ట్రాల్లో సడలించిన ఆంక్షలు, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో విమాన ప్రయాణాలపై ప్రయాణికులకు ధైర్యం పెరుగుతోంది. జూన్‌లో 4 లక్షల మందికి పైగా రాకపోకలు సాగినట్లు జీఎంఆర్ తెలిపింది.

flight
flight
author img

By

Published : Jul 5, 2021, 7:53 PM IST

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి పెరుగుతోంది. కొవిడ్ సెకండ్​ వేవ్​​ నుంచి కోలుకున్న తర్వాత క్రమంగా రద్దీ పెరుగుతుంది. ప్రయాణికుల రక్షణ కోసం జీఎంఆర్... సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని కల్పిస్తోంది. దేశంలోని అన్ని నగరాలకు విమాన ప్రయాణాల సంఖ్య పెరిగింది. జూన్ 1 నుంచి 30 తేదీల మధ్య విమానాశ్రయం నుంచి 4 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 35 వేల మంది విదేశాలకు ప్రయాణించారు. కొవిడ్ నిబంధనల అమలుకు విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్ బృందాల సహాకారంతో రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. కొవిడ్ భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి జీఎంఆర్ లిమిటెడ్ 20 మంది అధికారులను, ప్రత్యేక పోలీసు అధికారులు ఎస్పీవోలను నియమించింది.

క్యూఆర్​ కోడ్​ టెక్నాలజి
క్యూఆర్​ కోడ్​ టెక్నాలజి

నిబంధనలు పాటించకపోతే జరిమానా..

విమానాశ్రయంలో కొవిడ్ మార్గదర్శకాలను పాటించని ప్రయాణికులు, సందర్శకులు, సిబ్బందికి జరిమానా విధించే అధికారం వీరికి ఉంటుంది. టెర్మినల్‌లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతూ నిరంతరం ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో అనౌన్స్​మెంట్​ చేస్తున్నారు. కొవిడ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో సైనేజ్‌లను ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక శానిటైజేషన్​ చర్యలు
కట్టుదిట్టంగా శానిటైజేషన్​ చర్యలు

రక్షణ కోసం ప్రత్యేక చర్యలు

ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం కొవిడ్ జాగ్రత్తల సమాచారం వివిధ ప్రదేశాలలో ప్రదర్శిస్తున్నారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి, ప్రయాణికులు సెల్ఫ్-చెకిన్ సౌకర్యం, సెల్ఫ్-బ్యాగ్ ట్యాగ్ సౌకర్యం లాంటి సెల్ఫ్ సర్వీసులను ఉపయోగించుకోమని ప్రోత్సహిస్తున్నారు. విమానాశ్రయం ఫోర్‌కోర్ట్ ప్రాంతంలో, చెక్-ఇన్ హాల్స్‌లో భౌతిక దూర నిబంధనల ప్రకారం సెల్ఫ్-చెకిన్ కియోస్క్‌లను ఏర్పాటు చేసారు. టచ్-లెస్ టెక్నాలజీని కలిగిన ఈ కియోస్క్​లు క్యూఆర్​ (QR CODE) కోడ్ ద్వారా చెక్​ఇన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సహాయపడతాయని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ అని తెలిపారు.

ఇదీ చూడండి: మధ్య సీటు ఖాళీతో కరోనా ముప్పు తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.