ETV Bharat / state

సెప్టెంబరు 15నుంచి ఇంజినీరింగ్​ విద్యా సంవత్సరం - అఖిల భారత సాంకేతిక విద్యామండలి

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భారత్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ తరగతులు సెప్టెంబర్‌ 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను జారీ చేసింది.

AICTE says engineering colleges to start from September 15
సెప్టెంబరు 15నుంచి ఇంజినీరింగ్​ విద్యా సంవత్సరం
author img

By

Published : Jul 3, 2020, 6:47 AM IST

ఇంజినీరింగ్​ కోర్సు నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరు 15 నుంచి ప్రారంభించాలని అఖిల భారత విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. బీటెక్​ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని గత నెలలో ఏఐసీటీఈ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏటా ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలి. కరోనా పరిస్థితులను సమీక్షించిన ఏఐసీటీఈ.. ఈసారి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించేలా కాలపట్టికను విడుదల చేసింది.

జులై 15వ తేదీలోపు విశ్వవిద్యాలయాలు కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని, మొదటి విడత బీటెక్​ సీట్ల కేటాయింపును ఆగస్టు 30లోగా, రెండో విడత కౌన్సెలింగును సెప్టెంబరు 10వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాత (రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మెుదలు పెట్టాలని సూచించింది.

ఇవీ చూడండి: 'గిరిజన విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.