ETV Bharat / state

నైపుణ్యం పెంచే ఐడియా ల్యాబ్​లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయంటే.. - కళాశాలలో ఐడియా ల్యాబ్​లు

Idea Labs in Colleges: విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు పెంచడంతో పాటు ఊహాశక్తిని పెంపొందించడం.. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టి అంకుర కేంద్రాలుగా మార్చాలన్నది ఉద్దేశంతో కళాశాలలలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్​లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా 50 కళాశాలలకు వీటిని మంజూరు చేసింది. దీనిలో తెలంగాణలో నాలుగు, ఏపీలో ఐదు కళాశాలలకు చోటు దక్కింది.

Idea Labs in Colleges
ఐడియా ల్యాబ్​లు
author img

By

Published : Jan 4, 2022, 7:19 AM IST

Idea Labs in Colleges: పుస్తక పరిజ్ఞానం కాదు.. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం.. వినూత్నంగా ఆలోచించే అభ్యర్థులు కావాలని పరిశ్రమలు కోరుకుంటున్న నేపథ్యంలో.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆ దిశగా దేశంలోని పలు కళాశాలలను తీర్చిదిద్దుతోంది. తమకు వచ్చే ఆలోచనలకు అంకురరూపం ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఐడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా 50 కళాశాలలకు వీటిని మంజూరు చేసింది. తెలంగాణలో నాలుగు, ఏపీలో అయిదు కళాశాలలకు చోటు దక్కింది. విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు పెంచడంతో పాటు ఊహాశక్తిని పెంపొందించడం.. లోతుగా ఆలోచించి విశ్లేషించడం.. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టి.. అంకుర కేంద్రాలుగా మార్చాలన్నది ఉద్దేశం. అందుకోసమే ఐడియా ల్యాబ్‌లను ఏఐసీటీఈ ఏర్పాటు చేస్తోంది. అందుకు నాన్‌ మెట్రో సిటీ కళాశాలలనే ఎంపిక చేస్తోంది. దేశవ్యాప్తంగా పదేళ్లు పూర్తయిన కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిలో ఏదో కోర్సుకు ఎన్‌బీఏ గుర్తింపు ఉండాలి. ఒక్కో ల్యాబ్‌కు 5 వేల చదరపు అడుగుల గదులు అవసరం. అందులో అవసరమైన పరికరాలు, నిర్వహణకు రూ.1.10 కోట్లు అవసరమవుతాయి. ఏఐసీటీఈ రూ.55 లక్షలు ఇస్తుంది. దాదాపు 270 కళాశాలలు పోటీపడగా చివరకు 50 కళాశాలలు ఎంపికయ్యాయి.

రోజంతా తెరిచే ఉంటాయ్‌...

ఈ ల్యాబ్‌లు 24 గంటలపాటు తెరిచే ఉంటాయి. అన్ని బ్రాంచీల విద్యార్థులు వాటిని వినియోగించుకోవచ్చు. దీనిపై ఏఐసీటీఈ ప్రతి కళాశాల నుంచి అయిదుగురు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చింది. సమన్వయకర్తలను నియమించింది. వారు విద్యార్థులకు మెంటార్లుగా ఉంటారు. ‘ఐడియాలను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహించాం. అందులో ఆరు ఎంపిక చేశాం. తాజాగా ఒక కంపెనీ వచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తమ ఆలోచనలకు నగదు పురస్కారాలిచ్చేందుకు ముందుకొచ్చింది’ అని గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సహ సమన్వయకర్త రంగనాయకులు తెలిపారు.

idea labs in telangana: ఎంపికైన తెలంగాణ కళాశాలలు: గురునానక్‌ (ఇబ్రహీంపట్నం), బీవీఆర్‌ఐటీ (నర్సాపూర్‌), బాలాజీ (నర్సంపేట), జయముఖి (వరంగల్‌)

ఏపీ: పొట్టి శ్రీరాములు (విజయవాడ), క్యూఐఎస్‌ (ఒంగోలు), ఎస్‌ఆర్‌కేఆర్‌ (భీమవరం), శ్రీవిద్యానికేతన్‌ (తిరుపతి), విజ్ఞాన్‌ (విశాఖపట్టణం)

ఇదీ చూడండి: టీనేజర్లకు కరోనా టీకా​.. తొలి రోజు ఎంతమందికి అంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.