తెలంగాణలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నందున పరీక్షల సంఖ్య పెంచాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వాటిపై పర్యవేక్షణ చేయాలని కోరారు.
కొవిడ్ పరీక్షకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో క్షేత్రస్థాయిలో అమలవడం లేదన్నారు. ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లినా... ఇంటికొచ్చి శాంపిల్ తీసినా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మూసీ ప్రక్షాళనపై ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ