ETV Bharat / state

'ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం' - hyderabad news

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటే... ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తక్షణమే విచారణకు ఆదేశించి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

aicc spokes person dasoju sravan comments on central minister kishan reddy
'ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం'
author img

By

Published : Nov 12, 2020, 3:06 PM IST

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రాజ్యాంబద్ధమైన పదవిలో ఉంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ గగ్గోలు పెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీసులపై నేరుగా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నా.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొనడం ఏమిటని ఒక ప్రకటనలో నిలదీశారు. దుశ్చర్యలకు పాల్పడుతూ రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోగల్గిన అన్ని అధికారాలు ఉండి ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు.

సాధికారత కలిగిన, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి కూడా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సామాన్యుల మాదిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేతల ఫోన్లను ట్యాప్‌ చేయడం ఎప్పటి నుంచో జరుగుతోందని, ఇప్పుడు కిషన్​రెడ్డికి కూడా తెలిసిందున..హోంశాఖనే స్వయంగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదన్నారు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ గోప్యతను, రాష్ట్ర పోలీసులు, ఐఏఎస్‌ అధికారి జయేష్‌ రంజన్‌లు ఉల్లంఘిస్తున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర హోంశాఖకు గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తక్షణమే విచారణకు ఆదేశించి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: కరోనా వ్యాక్సిన్‌పై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.