వ్యవసాయం దండగ కాదు, పండుగ చేస్తామన్న సీఎం కేసీఆర్... నియంత్రిత వ్యవసాయం పేరుతో రైతులను నిలువునా ముంచేశారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి ఆరోపించారు. సన్నాలు సాగు చేసిన అన్నదాతలకు ఆశించిన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. మొక్క జొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు.
సన్న ధాన్యాన్ని క్వింటాకి రూ.2500లతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయనున్నట్లు ప్రధాన మంత్రి మోదీ ప్రకటించినప్పటికీ... కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలతో అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలు వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు లాంటివని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: క్రమంగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు