ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ మండిపడ్డారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గాంధీభవన్‌లో చేపట్టిన ఎన్ఎస్యూఐ నాయకుల 48గంటల దీక్షను విరమింపజేశారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, బలమూర్ వెంకట్‌లకు మాజీ ఎంపీ మధుయాస్కీ, మాజీ మంత్రి పురుషోత్తం రావులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపే అవకాశం ఉన్నా... భాజపా దీక్షలు మాత్రమే చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక కేసీఆర్ కుటుంబ సభ్యలున్నారని ధ్వజమెత్తారు. అందుకే అర్హత లేకపోయినప్పటికీ... కాంట్రాక్టు ఇచ్చి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మధు యాస్కీ.
ఇవీ చదవండి: మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం సమీక్ష