రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియాతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసు, శ్రీనివాస్ కృష్ణన్ ఆరోపించారు. రాజ్యాంగపరంగా ప్రజలకు సంక్రమించిన హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. శ్రీశైలం ఘటనా స్థలానికి వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని అరెస్టు చేయడం దారుణమన్నారు.
అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేసి బాధితులను పరామర్శించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రజా ప్రతినిధులను అక్కడికి పంపి పరిశీలించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. శ్రీశైలంలో జరిగిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.