ధాన్యం కొనుగోలులో వ్యర్థాల పేరుతో కోత పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అంటున్నారని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లు, ఎఫ్‌సీఐ సంస్థ వ్యర్థాల పేరుతో రైతుల నుంచి ఐదారు కిలోలు కోతపెడుతున్న విషయాన్ని వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు వినోద్‌కుమార్‌కు తెలియచేసినట్లు వివరించారు.
కిలోన్నరకు మించితే చర్యలే...
ఇప్పటికే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని...దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారని కొదండ స్పష్టం చేశారు. వ్యర్థాల పేరుతో కిలోన్నరకు మించి ఎవరైనా కోత పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వినోద్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కోదండ రెడ్డి అన్నారు. ఫలితంగా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'కరోనా టెస్టింగ్ కిట్లతో వ్యాపారమా? సిగ్గుచేటు'