ETV Bharat / state

నిరాడంబరంగా రాహుల్ గాందీ‌ జన్మదిన వేడుకలు - హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో రాహుల్ గాందీ‌ జన్మదిన వేడుకలు

ఏఐసీసీ మాజీ అధ్య‌క్షులు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జ‌న్మ‌దినోత్సవాన్ని ఏలాంటి హంగూ ఆర్భాటం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. గాంధీ భ‌వ‌న్‌లో నిర్వహించిన ర‌క్త‌దాన శిబిరాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

aicc-farmer-chairman-rahul-gandhi-birthday-celebrations-in-gandhi-bhavan-hyderabad
నిరాడంబరంగా రాహుల్ గాందీ‌ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jun 19, 2020, 5:38 PM IST

ఏఐసీసీ మాజీ అధ్య‌క్షులు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జ‌న్మ‌దిన వేడుక సందర్భంగా... ఏఐసీసీ ఆదేశాల మేర‌కు హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో పేదలకు నిత్యావ‌స‌ర స‌రకులు పంపిణీ, అన్న‌దాన, ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు చేపట్టారు. కొవిడ్ -19 నివార‌ణ‌లో ముందుండి ప‌ని చేస్తున్న ఫ్రంట్ వారియ‌ర్స్‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాలను పార్టీ నాయ‌కులు, శ్రేణులు విస్తృతంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఛీప్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గ్రేట‌ర్ అధ్య‌క్షుడు అంజన్‌కుమార్ యాద‌వ్, యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు అనిల్‌కుమార్ యాద‌వ్‌, హైద‌రాబాద్ పార్ల‌మెంటు అభ్య‌ర్థి ఫిరోజ్ ఖాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

గాంధీ భ‌వ‌న్‌లో రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్య‌క్షుడు బ‌ల‌మూరు వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ర‌క్త‌దాన శిబిరాన్ని ఉత్త‌మ్ ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల క‌రోనాతో మృతి చెందిన జ‌ర్న‌లిస్టు మ‌నోజ్ కుమార్ కుటుంబానికి 50వేల రూపాయ‌ల చెక్కును అంద‌చేశారు.

రాష్ట్ర యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు అనిల్ కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో దాదాపు వెయ్యి మంది పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్క‌లు, శానిటైజ‌ర్లు పంపిణీ చేశారు.

అమ‌రుల‌ ఆత్మ‌‌కు శాంతి చేకూరాల‌ని...

గ‌ల్వాన్ లోయ వ‌ద్ద జ‌రిగిన పోరాటం‌లో క‌ల్న‌ల్ సంతోశ్‌ బాబుతోపాటు 20 మంది సైనికులు అమ‌రులు కావ‌డంపై పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. అమ‌రుల‌ ఆత్మ‌‌కు శాంతి చేకూరాల‌ని రెండు నిమిషాలు మౌనం పాటించారు. భార‌త్ స‌రిహ‌ద్దులోకి చొచ్చుకుని వ‌చ్చి 20 మంది సైనికుల‌ను చైనా హ‌త‌మార్చ‌డం... దుశ్చ‌ర్యగా అభివ‌ర్ణించిన ఉత్త‌మ్ ఆ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. చైనాకు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డ‌మే అమ‌రుల‌కు నిజ‌మైన నివాళి అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

నిరాడంబరంగా రాహుల్ గాందీ‌ జన్మదిన వేడుకలు

ఇదీ చూడండి: రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు

For All Latest Updates

TAGGED:

rahul gandhi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.