ETV Bharat / state

'భవిష్యత్​లో యువతకు ప్రధాన వృత్తి వ్యవసాయమే' - వ్యవసాయ వార్తలు తెలంగాణ

"తెలంగాణ సిరి" పేరిట సిటీ కంపోస్ట్ బ్రాండ్​ను హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఆవిష్కరించారు. రైతులు "సిరి" ఎరువులు వినియోగిస్తూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకుంటూ వెళ్లేలా టీఎస్ అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా ప్రొత్సహిస్తామని మంత్రి వెల్లడించారు.

భవిష్యత్​లో యువతకు ప్రధాన వృత్తి వ్యవసాయమే : మంత్రి నిరంజన్​రెడ్డి

author img

By

Published : Sep 7, 2020, 7:21 PM IST

Updated : Sep 7, 2020, 10:18 PM IST

రాష్ట్రంలో వ్యవసాయానికి చక్కటి భవిష్యత్ ఉండబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాబోయే మూడు నాలుగేళ్ళల్లో కొత్త తరం యువత వృత్తిగా వ్యవసాయం చేసి అద్భుతాలు సృష్టిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్లో "తెలంగాణ సిరి" పేరిట సిటీ కంపోస్ట్ బ్రాండ్​ను మంత్రి ప్రారంభించారు.

'భవిష్యత్​లో యువతకు ప్రధాన వృత్తి వ్యవసాయమే'

సిటీ కంపోస్ట్..

" తెలంగాణ యంత్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిటీ కంపోస్ట్​ను ప్రోత్సాహించాలన్న లక్ష్యంతో... సర్కారు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏనాటికైనా బతుకు తెరువు, ఉపాధి కల్పించేది కీలకంగా ఉన్న వ్యవసాయమే. హరిత విప్లవం నేపథ్యంలో అధిక దిగుబడుల సాధన కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఫలితంగా భూసారం, నీరు, పర్యావరణం దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే.. రసాయన ఎరువులు, పురుగుల మందులను హేతుబద్ధంగా, క్రమబద్ధీకరణ దిశగా వినియోగించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న యోచిస్తున్నాం. ఈ ఏడాది నుంచే హైదరాబాద్ మహానగరం సహా‌..‌. ఇతర నగరాలు, పట్టణ ఆవాసాల్లో పెరటి తోటలు, డాబాలపై కూరగాయలు, మొక్కల పెంపకంలో "తెలంగాణ సిరి" సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సాహించనున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతులు "సిరి" ఎరువులతో ముందుకు వెళ్ళేలా టీఎస్ అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా ప్రోత్సహిస్తాం"

- సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, టీఎస్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఎండీ కె.రాములు, జీఎం రాజమోహన్, భవానీ బయో, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

Last Updated : Sep 7, 2020, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.