ETV Bharat / state

telangana governer in ftcci hyderabad nampally : 'సహకార రంగాల సేవల్లో ముందంజలో దక్షిణ భారతదేశం' - సహకార సంఘం సదస్సు నాంపల్లి 2023

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో అఖిల భారత సహకార సంఘం ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సహకార సదస్సు నిర్వహించారు. హైదరాబాద్​లోని నాంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌదరరాజన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో సహకార సంఘాల పరిణామం గురించి పేర్కొన్నారు.

Telangana Governer In FTCCI Hyderabad
telangana governer in ftcci hyderabad nampally
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 5:00 PM IST

Telangana Governer In FTCCI Hyderabad : దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో అఖిల భారత సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సహకార సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ టీఎస్ మార్క్‌ఫెడ్, గంగారెడ్డి, జాతీయ సహకార సంఘం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సుధీర్‌ మహాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెద్ ప్రకాష్‌ సేథియా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల సహకార ఉద్యమకారులు, నిపుణులు పాల్గొన్నారు.

దుబ్బాక సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం

Co- Operative Socities Development In South India : పలు దేశాల్లో... ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో సహకార రంగంలో సవాళ్లు, విజయాలు నమోదు చేసుకుంటున్న సహకార సంఘాల విజయగాధలను గవర్నర్​ తమిళిసై గుర్తుచేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలు, విధులు, భవిష్యత్తులో సహకార రంగ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి దృష్ట్యా క్షేత్రస్థాయిలో సహకార సంఘాల ద్వారా రైతులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే అన్నదాతల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గవర్నర్ తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయంలో రాబడులు మరింత పెంచేందుకు, సహకార సంఘాలు మంచి తోడ్పాటు ఇవ్వాలని ప్రధాని ఆదేశమన్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో అఖిల భారత సహకార సంఘం వ్యవసాయం పట్ల నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు.

Kattangur Co operative Society : అన్నదాతకు అండగా.. రైతు ఉత్పత్తిదారుల సంఘం

Co Operative Groups In Villages : దేశంలోని అన్ని రాష్ట్రాలలో సహకార సంఘాలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. ఈ సంఘాల ద్వారా రైతులు తమ మూలధనాన్ని పెంచుకోవచ్చు. ప్రభుత్వ రంగం మాదిరిగా పని చేసే ఈ సహకార సంఘం ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సహాయం అందిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ సంఘాలు రైతులను సంఘటితం చేస్తూ రాబడులు పెరిగేలా సహకరిస్తున్నాయి.

రుణం ఒకరిది డబ్బు మరొక్కరది.. ఆందోళనలో మహబూబ్‌నగర్‌ రైతన్నలు

'గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు సంఘటితంగా ముందుకు సాగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ విషయంలో తమిళనాడు సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సాగుదారులను వికేంద్రీకరణం చెయ్యడం ద్వారా ఉత్తమ శిక్షణ, వైవిధ్యమైన పద్ధతులు, ఆవిష్కరణలు చేయవచ్చు. వీటి వల్ల రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా మంచి లాభాలు పొందుతున్నారన్నారు. ప్రజాస్వామ్య భారతంలో గ్రామ పంచాయతీలు మూలస్థంభాలు అని... అవి బలంగా పనిచేస్తే వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో స్వయం సంవృద్ధి సాధించవచ్చు' - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​

గిరిజనులతో ఆడిపాడిన గవర్నర్ తమిళిసై

నేను డాక్టర్​నే కాదు పెయింటర్​ను కూడా: తమిళి సై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.