సింగరేణి సంస్థకు, దక్షిణ మధ్య రైల్వే విభాగానికి మధ్య రైల్వే వ్యాగన్లలో జాప్యం లేకుండా బొగ్గు లోడింగ్, సత్వర బొగ్గు రవాణా అంశాలపై సోమవారం ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రాలపై రైల్వేశాఖ నుండి చీఫ్ కమర్షియల్ మేనేజర్ క్రిస్టోఫర్, సింగరేణి నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్విన్, అడిషనల్ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అక్టోబర్ 10 నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో సింగరేణి సంస్థ వేగంగా బొగ్గు లోడింగ్ జరుపనుంది. దీంతో వినియోగదారుడు నిర్ణీత సమయానికి బొగ్గును పొందగలుగుతాడు. ఈ విధంగా అందరికీ ఎంతో మేలు చేసే 'ఇంజన్ ఆన్ లోడ్' ఒప్పందం ఇప్పటికే సింగరేణిలోని 5 సైట్లలో విజయవంతంగా అమలవుతోంది. తాజాగా శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలకు కూడా దీన్ని వర్తింపచేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇవీ చూడండి;హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ