స్వదేశీ చికిత్సా విధానాలు, రోగనిర్ధారణ సాధనాలు, రోగులకు మెరుగైన సంరక్షణను కల్పించే ఆవిష్కరణలను పెంపొందించడం కోసం, స్వీయ-ఆధారిత వైద్య పరిశోధన వైపు పురోగమించడం కొరకు ఏఐజీ హాస్పిటల్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక చారిత్రక ఒప్పందాన్ని చేసుకున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో "మైక్రోబ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్" అనే కార్యక్రమంపై రెండు రోజులపాటు నిర్వహించిన వైజ్ఞానిక సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి సమావేశంలో ఏఐజీ డాక్టర్లు, విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
"ఏఐజీ నుంచి అత్యంత నిష్ణాతులైన వైద్యులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నుంచి అత్యంత పరిజ్ఞానం కలిగిన పరిశోధకులతో కూడిన పరిశోధనా కార్యక్రమం ఆరంభం అయింది. ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనకు క్లినికల్ నైపుణ్యతను జోడించడం ద్వారా వచ్చిన ప్రయోగశాల ఫలితాలతో రోగికి స్వస్థత చేకూర్చడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటికే మా ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా చేపడుతున్న మా బృందం ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బృందంతో కలిసి పనిచేస్తుంది. మొత్తంగా, వ్యాధులను బాగా అర్థం చేసుకొని మన జనాభాకు తగినట్లు వ్యాధినివారణ మార్గాల కొరకు అన్వేషిస్తున్నాం. అందుబాటు ధరలో, అత్యంత నాణ్యమైన రోగి సంరక్షణా పద్ధతులు నెలకొల్పే దృష్టితో ఏఐజీ హాస్పిటల్స్, ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌లో మేము నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. తద్వారా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని సమాన పద్ధతిలో సాధించవచ్చు. ట్రాన్స్లేషనల్ రీసెర్చ్, జవల్యూషనరీ జెనెటిక్స్, మైక్రోబయోమ్‌లు కూడిన బహుళ ప్రాజెక్టులపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కలిసి పనిచేయబోతున్నాం. వీటన్నింటి ద్వారా రోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. జన్యు పరంగా పాశ్చాత్యుల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నాం అనే ఆధారంగా మన జనాభా నిర్దిష్ట చికిత్సా విధానాలను ఏర్పాటు చేయాలి." డా. డి. నాగేశ్వర్ రెడ్డి, ఛైర్మన్, ఏఐజీ హాస్పిటల్స్
"ముఖ్యమైన ఆవిష్కరణలను వెలికి తీసేందుకు, స్పష్టమైన ప్రయోజనాలతో పరిశోధనలు చేపట్టడానికి ఇది సరైన సమయం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఏఐజీ హాస్పిటల్స్‌లోని ఈ పరిశోధకుల, వైద్యుల భాగస్వామ్యం ద్వారా ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమౌతాయి. మా పరిశోధనా నైపుణ్యం ద్వారా ఏఐజీ వైద్యులు రోగికి మెరుగైన చికిత్స అందించేలా తోడ్పాటు అందిస్తూనే వైద్యుల కొరకు యం.డి-పీహెచ్డీ సమీకృత కార్యక్రమం వంటి కొత్త కోర్సులను కూడా మేము రూపొందిస్తాం" -ప్రొ. బి.జె. రావు, వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
"రోగి సంరక్షణ కొరకు అత్యుత్తమ ప్రమాణాలతో మౌలిక వసతులు కలిగిన ఏఐజీ హాస్పిటల్స్‌తో కలిసి మేము పనిచేయడానికి మాకెంతో ఆనందంగా ఉంది. పలు రకాల రోగాలకు చికిత్స అందించడానికి అత్యంత అనుకూలమైన మూలకాలను మేము రూపకల్పన చేయడానికి వారి వైద్య విజ్ఞానం, నైపుణ్యత మాకు ఉపయోగపడుతుంది." -ప్రొ. దయానంద సిద్దావట్టం, డీన్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఇవీ చదవండి: