ETV Bharat / state

జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు.. తిండికి తిప్పలు.. తాగునీటికి కష్టాలు

agency villages: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు నీటమునగడంతో నాలుగైదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిండి తప్పలు లేక.. తాగడానికి మంచినీళ్లు కూడా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఏజెన్సీ గ్రామాలు
ఏజెన్సీ గ్రామాలు
author img

By

Published : Jul 14, 2022, 8:17 AM IST

agency villages: రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడం, గ్రామాలు నీటమునగడంతో నాలుగైదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాలకు రవాణా అవకాశాల్లేకపోవడంతో స్థానిక దుకాణాల్లో నిత్యావసర సరకులు నిండుకుంటున్నాయి.

..

* ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో వాగులు పొంగడంతో దాదాపు 200కు పైగా గిరిజన గ్రామాలు, ఆవాసాలు నీటిలో చిక్కుకున్నాయి. ఉట్నూరు, నార్నూరు, జైనూరు, సిరికొండ, సిర్పూర్‌(యు), బోథ్‌ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్‌లో బుగ్గవాగు పొంగి, కల్వర్టు కొట్టుకుపోవడంతో తిర్యాణికి సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీలో అయిదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

* ఏటూరు నాగారంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లోని 4వేల మందిని అధికారులు 24 పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగపేట, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటికి, కూరగాయలకు ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని ఆవాసాల్లో అధికారులు కూరగాయలు పంపిణీ చేశారు.

* భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గోదావరి ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాలు నీటమునిగాయి. మండల కేంద్రాలు, గిరిజన గ్రామాలు, ఆవాసాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే 3600 మందిని అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌, పదర మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్తు సరఫరా చాలాసేపు నిలిచిపోతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.