స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రతిఘటించాలంటూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆందోళనకు దిగింది. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో అఖిల రైతు సంఘాలు, వాపపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఆర్‌ఈసీపీ ఒప్పందాలను తిరస్కరిద్దామంటూ నినాదాలు చేశారు. డబ్ల్యూఓటీ కంటే ప్రమాదకరమైన ఒప్పందంమని ఆరోపించారు.
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం - ఆర్‌సీఈపీ పేరిట 16 దేశాలతో జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయులు, రైతులకు ఎంతో నష్టదాయకమైందని చెప్పారు. పండించిన వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవని రైతాంగం ఆందోళన చేస్తున్న తరుణంలో... యావత్ దేశ ప్రజల ఆర్థిక భద్రతకు విఘాతం కలిగే ఒప్పందంపై సంతకం చేయవద్దంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఆర్సెప్ సమావేశం.. భారత కీలక నిర్ణయం ఎటు..?