ఏపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. వాడరేవులో శుక్రవారం మత్స్యకారుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన మత్స్యకార బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ కాన్వాయిలో ఆమంచి కృష్ణమోహన్, కరణం వర్గాల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు ఆమంచి వర్గీయులకు గాయాలయ్యాయి. బాధితులను చీరాల ఆసుపత్రికి తరలించారు.
మోపిదేవి వెంకటరమణ వాహనాన్ని అనుసరిస్తూ తమ కారును అడ్డుకుని కరణం వెంకటేశ్ అనుచరులు తమపై దాడి చేసినట్లు బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి: రైతుల ఆందోళనపై అమిత్ షా నివాసంలో కీలక భేటీ