తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఆమె కలిశారు. దీంతో రచనా రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల తరఫున హైకోర్టులో రచనా రెడ్డి కేసులు వేసి వాదించిన సంగతి తెలిసిందే. ఆమె వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రస్తావించడం గమనార్హం.
ఇదీ చూడండి: ఎంపీ రఘురామ ఇంటివద్ద ఆగంతకుడి గుర్తింపు.. తీరా చూస్తే అతడు..!