ETV Bharat / state

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? అయితే ఇది మీకోసమే..! - failed exam depressed

ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. పాసైనవాళ్లంతా మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, లా, ఒకేషనల్‌ కోర్సులు... ఇలా వేటిలో చేరాలా అని ఆలోచిస్తుంటారు. విజేతలను ప్రపంచం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. వాళ్లకు అందరి ప్రశంసలూ అందుతాయి. కానీ ఫెయిల్‌ అయినవాళ్ల సంగతి ఏమిటి? వారి గురించి ఒక్కసారి ఆలోచిద్దామా....

advice for students who fail the exams
పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? అయితే ఇది మీకోసమే..!
author img

By

Published : Jun 29, 2022, 9:20 AM IST

  • అపజయానికి ఎన్నో కారణాలుంటాయి. పరీక్షల సమయానికి విద్యార్థి ఆరోగ్యం సరిగాలేకపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల అనారోగ్యం, ఆకస్మిక మరణం వారిని లక్ష్యం నుంచి వెనక్కు నెట్టొచ్చు.
  • ఫెయిలైన తర్వాత కుటుంబసభ్యులు కోప్పడతారనో.. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేస్తారనో.. చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేమనే భయంతో ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.
  • నిజానికి గెలుపోటములు తాత్కాలికమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి రాత్రి అలాగే శాశ్వతంగా ఉండిపోదు. దాని వెంట వెలుగూ వస్తుంది. వైఫల్యానికి కారణాలను తెలుసుకుని మధ్యంతర పరీక్షలకు సిద్ధంకావాలి.
  • మంచి మార్కులు తెచ్చుకున్న నేస్తాలను కలిసి పరీక్ష రాయడంలోని కొన్ని మెలకువలనూ నేర్చుకోవచ్చు. వారి సహాయంతో ఈసారి బాగా రాసి విజయం సాధించవచ్చు.
  • అన్నిటికంటే ముఖ్యమైంది మన ప్రాణం. మనమంటూ జీవించి ఉంటే... ఈరోజుకాక పోతే రేపు విజయం మన బానిస అవుతుంది. క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో అమూల్యమైన జీవితాన్ని కోల్పోతాం.
  • ‘తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలనీ... తరిమేవాళ్లను హితులుగ తలచి ముందుకెళ్లాలని...’ కన్నీళ్లను తుడిచే ఇలాంటి స్ఫూర్తిదాయక గీతాలను వినొచ్చు. బాధను మరిపించి మనసుకు సాంత్వన అందించే పాటలు మనకెన్నో ఉన్నాయి. మనసుకు దగ్గరైన స్నేహితులతో బాధను పంచుకుంటే బాధ సగం తగ్గినట్టే.
  • ఇదే చివరి అపజయం అనుకుని సానుకూల దృక్పథంతో ప్రయత్నించడం మొదలుపెట్టాలి. ఆత్మవిశ్వాసం ముందు వైఫల్యం తలవంచుతుంది. ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగుతుంది.
  • చివరిగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతోమంది కుబేరులు, వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు ఉన్నత చదువులు చదివినవారు కాదు. అయినా... వాళ్లంతా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని అందులో అద్భుతాలు సృష్టించారు. ప్రయత్నిస్తే మీరూ అలా కాగలరు!

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.