Adulteration Of Ice cream In Hyderabad : ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఎంతో ప్రియమైన పదార్థం ఐస్‌క్రీమ్. ఈ ఐస్‌క్రీమ్‌లు అనేక పేర్లతో వివిధ రుచుల్లో మార్కెట్లో దొరుకుతాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇక ఈ ఐస్‌క్రీములకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌నే ఆసరాగా తీసుకొని.. కొంత మంది కల్తీ మనుషులు లాభాపేక్షతో కల్తీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నారు. సరైన నాణ్యత ప్రమాణాలను పాటించకుండా.. అక్రమ మార్గంలో వీటి తయారీని గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని.. వీటిని విక్రయిస్తున్నారు.
నగరం అభివృద్ధి చెందుతున్న కొలదీ.. అక్రమ దందాలు కూడా రోజురోజుకీ పెరుగుపోతూనే ఉన్నాయి.. వీటిలో ఈ ఐస్‌క్రీమ్ అక్రమదందా ఒకటి.. రెండు నెలల క్రితమే నగరంలో కల్తీ ఐస్‌క్రీములను అమ్ముతున్న ముఠాను కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతం రాజేంద్రనగర్ కాటేదాన్‌లో కల్తీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈమేరకు ఆ ముఠా సభ్యుడిని అరెస్టు చేసి.. మైలార్ దేవపల్లి పోలీసులకు అప్పగించారు.
Ice Cream Adulteration Rocket In Hyderabad : ప్రమాదకరమైన రసాయనాలు, ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి కల్తీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి.. ఈ ముఠా మార్కెట్లో విక్రయిస్తోందని పోలీసులు తెలిపారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లను విక్రయిస్తూ.. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమను నెలకొల్పి.. ఈ అక్రమ దందాకు తెరతీశారని వివరించారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే.. దర్జాగా పరిశ్రమను నిర్వహిస్తున్నారన్నారు. నాణ్యతలేని, సరైన ప్రమాణాలు పాటించని.. గడువు ముగిసిన ఐస్‌క్రీమ్ ప్యాకెట్లను పట్టుకున్నారు. ఇలా లైసెన్సులు లేకుండా ఎవరైనా ఇలాంటి దందాలు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే జైలే శరణ్యమని పోలీసులు హెచ్చరించారు. వీటి పట్ల ప్రజలు పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కోరారు.
కల్తీ ఐస్‌క్రీములను తినడం వల్ల వచ్చే నష్టాలు : రసాయనాలు కలిపిన ఐస్‌క్రీములను తినడం వల్ల గొంతు, అజీర్తి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల ఐస్‌క్రీములు తినేటప్పుడు రసాయనాలు కలుస్తున్నాయోమో అని జాగ్రత్త వహించాలి. పిల్లలకు వీటి నుంచి దూరంగా ఉంచితే ఎంతో మంచిది. ఇలాంటి ఐస్‌క్రీములు తినడం వల్ల శరీరంలో విషపదార్థాలు అనేవి పెరిగి.. ప్రాణాపాయస్థితి సంభవిస్తుంది.
ఇవీ చదవండి :