హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గౌలిగూడ, ఇడ్లిగల్లీ, టెలిఫోన్ బస్తీలో నివసించే పేద ప్రజలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. సంస్థ ఛైర్మన్ నంద కిశోర్ బిలాల్ వెయ్యి మంది పేదలకు సరుకులు అందించారు.
సీఎం కేసీఆర్ అదేశాలమేరకు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో... 38 రోజులుగా పేదలకు నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 29వరకు సరుకుల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.