లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నాంపల్లిలోని కట్టెల మండి ప్రజలకు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ నిత్యావసర సరుకులను అందజేశారు. గోశామహల్ నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో గత 62 రోజుల నుంచీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అదేశాల మేరకు గోశామహల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని తమ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు నంద్ బిలాల్ స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి నియోజకవర్గంలో కరోనా టెస్టులతో పాటు శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కరోనాపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా