ETV Bharat / state

'పురపాలక ఎన్నికల పోలింగ్​​ కోసం పటిష్ఠ భద్రత'

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల కోసం 50వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారిని బాధ్యుడిగా నియమించినట్లు ఆయన తెలిపారు.

adg jitender
'పురపాలిక పోలింగ్​​ కోసం పటిష్ఠ భద్రత'
author img

By

Published : Jan 21, 2020, 10:33 PM IST

తెలంగాణ వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్​ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం ఎక్సైజ్, అటవీశాఖలకు చెందిన సిబ్బందిని పహారాకు వినియోగించుకుంటున్నట్లు జితేందర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకింద 131 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు.

రూ.51 లక్షలకు పైగా స్వాధీనం

తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జితేందర్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 1,122 కేసులు నమోదు చేసి 4,969మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. లైసెన్స్ కలిగిన 1,745 ఆయుధాలను ఠాణాలలో డిపాజిట్ చేయించున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు... ఓటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు డీజీపీ జితేందర్ కోరారు.

ఇదీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

TG_HYD_67_21_ADG_ON_ELECTION_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ NOTE- Additional dgp jithender ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల కోసం 50వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఒక్కో పురపాలకానికి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారిని బాధ్యుడిగా నియమించినట్లు జితేందర్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎక్సైజ్, అటవీశాఖలకు చెందిన సిబ్బందిని కూడా ఎన్నికల బందోబస్తులో వినియోగించుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జితేందర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 131 కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన వారిపైనా చర్యలు తీసుకున్నట్లు అదనపు డీజీపీ జితేందర్ తెలిపారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణి చేయకుండా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీల్లో భాగంగా 51లక్షలు 36వేల నగదు, 21లక్షలు 22వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జితేందర్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ కలిగిన 1745 ఆయుధాలను ఠాణాలలో డిపాజిట్ చేయించు చేసుకున్నారు. ఇప్పటి వరకు పురపాలక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోలేదని.... పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జితేందర్ తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు... పురపాలక ఎన్నికల ఓటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్ తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అధిక సంఖ్యలో ఓటింగ్ కోసం తరలివచ్చినట్లుగానే.... పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు... ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు డీజీపీ జితేందర్ కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.