స్థానిక సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 17 మంది అదనపు కలెక్టర్లను నియమించింది. ఎనిమిది మంది 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులతోపాటు తొమ్మిది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పల్లె, పట్టణప్రగతి సమర్థనిర్వహణ కోసం స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా ఆదనపు కలెక్టర్లను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాలతో మొత్తం 29 జిల్లాల్లో స్థానికసంస్థల కోసం అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లు వీరే...
- భద్రాద్రి కొత్తగూడెం - అనుదీప్ దురిశెట్టి
- జోగులాంబ గద్వాల్ - కోయ శ్రీహర్ష
- మహబూబాబాద్ - అభిలాష అభినవ్
- రాజన్న సిరిసిల్ల - బి.సత్యప్రసాద్
- పెద్దపల్లి - కుమార్ దీపక్
- ములుగు - ఆదర్శ్ సురభి
- నిర్మల్ - బి. హేమంత్ సహదేవ్ రావు
- మహబూబ్ నగర్ - తేజస్ నండ్లల్ పవార్
- వనపర్తి - కోట శ్రీవాస్తవ
- జగిత్యాల - జె.అరుణశ్రీ
- కరీంనగర్ - ఎ. నర్సింహారెడ్డి
- నారాయణపేట్ - కె.చంద్రారెడ్డి
- కుమురంభీం ఆసిఫాబాద్ - ఎం.నటరాజ్
- జయశంకర్ భూపాలపల్లి - వై. వి.గణేష్
- మెదక్ - బి.వెంకటేశ్వర్లు
- సూర్యాపేట - జి.పద్మజారాణి
- యాదాద్రి భువనగిరి - డి.శ్రీనివాస్ రెడ్డి
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక