Actress Dimple Hayathi Controversy : హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అటు డీసీపీ రాహుల్ హెగ్డే.. ఇటు నటి డింపుల్ హయాతి ఇద్దరూ స్పందించారు. ఈ క్రమంలోనే డింపుల్.. కావాలనే తన కారుకు ఆమె కారు అడ్డంగా పెట్టడం, కాలితో తన్నడం చేశారని డీసీపీ పేర్కొనగా.. అధికారాన్ని ఉపయోగించినంత మాత్రాన నిజం దాగదు అంటూ ట్విటర్ వేదికగా హయాతి రాసుకొచ్చారు. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు.
ఈ క్రమంలోనే డింపుల్ హయాతికి ప్రాణహాని ఉందని పాల్ సత్యనారాయణ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. డింపుల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. డింపుల్ మానసిక వేదనకు గురైందని.. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె భయపడుతుందని వివరించారు. డీసీపీ రాహుల్ హెగ్డే జంతువులను హింసిస్తుంటే డింపుల్ వారించిందని.. ఆ కక్షతోనే ఆమెపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. ఆమె ఎక్కడ కూడా కారును తన్నినట్టు సీసీ టీవీ ఫుటేజీ లేదన్న ఆయన.. ఈ కేసును తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని పునరుద్ఘాటించారు.
డింపుల్ హయాతికి ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డింపుల్ మానసిక వేదనకు గురైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె భయపడుతుంది. డీసీపీ రాహుల్ హెగ్డే జంతువులను హింసిస్తుంటే డింపుల్ వారించింది. ఆ కక్షతోనే ఆమెపై తప్పుడు కేసు పెట్టారు. ఆమె ఎక్కడ కూడా డీసీపీ కారును తన్నినట్టు సీసీ టీవీ ఫుటేజీ లేదు. ఈ కేసును మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం. - పాల్ సత్యనారాయణ, హీరోయిన్ డింపుల్ హయాతి తరఫు న్యాయవాది
ఇదీ వివాదం..: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హుడా ఎంక్లేవ్‌లో డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయాతి, డేవిడ్‌లు నివాసం ఉంటున్నారు. సెల్లార్‌లో ట్రాఫిక్ డీసీపీ ప్రభుత్వ వాహనం పక్కనే నటి డింపుల్ హయాతి, డేవిడ్‌లు తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 14న డింపుల్ హయాతి తన కారుతో డీసీపీ ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో డీసీపీ కారు ముందు భాగం కాస్త దెబ్బతింది. సీసీ ఫుటేజీ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డీసీపీ డ్రైవర్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లపై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. స్టేషన్‌కు పిలిపించి విచారించారు.
ఇవీ చూడండి..
Dimple Hayathi Controversy : ఐపీఎస్ అధికారి Vs టాలీవుడ్ హీరోయిన్.. తప్పెవరిది..?
Dimple Hayathi Case : ఐపీఎస్ అధికారితో హీరోయిన్ గొడవ 'రామబాణం' స్టార్‌పై క్రిమినల్ కేసు!