ETV Bharat / state

రవీంద్రభారతిలో కన్నులపండువగా లేపాక్షి పుస్తకావిష్కరణ సభ - telangana varthalu

రవీంద్రభారతిలో కన్నులపండువగా లేపాక్షి పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఈ తరం కంప్యూటరే జీవతమన్నట్లు గడుపుతున్నారని ఆయన అన్నారు.

రవీంద్రభారతిలో కన్నులపండువగా లేపాక్షి పుస్తకావిష్కరణ సభ

author img

By

Published : Mar 15, 2021, 4:50 AM IST

హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో ప్రముఖ చారిత్రక పరిశోధకులు, రచయిత మైనాస్వామి రచించిన... విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవానికి ప్రతీక ' లేపాక్షి ' పుస్తకావిష్కరణ సభ కన్నులపండువగా సాగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి శాఖ పూర్వ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి చెన్నూరు ఆంజనేయ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో... రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విరిగిన శిల్పంలో కనిపించినంత సౌందర్యం... పరిపూర్ణమైన శిల్పంలో కనిపించదని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. కంప్యూటరే జీవితమన్నటుగా గడుపుతున్న ఈ తరం మనదైన సంస్కృతి , సంప్రదాయాలు, సంగీతం... కళలు , బంధాలు , అనుబంధాలకు దూరంగా బతుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. మనదైన తెలుగు భాషను కాపాడేందుకు ప్రయత్నం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రవీంద్రభారతిలో కన్నులపండువగా లేపాక్షి పుస్తకావిష్కరణ సభ

ఇదీ చదవండి: ఇవాళ సమావేశం కానున్న కాంగ్రెస్​ శాసనసభాపక్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.