డ్రగ్స్ కేసును 2017లోనే పూర్తి చేసిన అధికారులు.. ఈడీ పేరుతో మళ్లీ నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగించిందని యువ నటుడు తనీష్ అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనీష్‌కు మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేడు తనీష్ విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన తనీష్... ఈడీ అడిగే బ్యాంకు వివరాలన్నీ అందజేస్తానని తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ అనే వ్యక్తితో తనకు ఎలాంటి పరిచయం లేదని తనీష్ స్పష్టం చేశారు.
2017 డ్రగ్స్ కేసు పూర్తైందన్నారు, మళ్లీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రశ్నించాలని అడిగారు. నా ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నేను ఈడీ అధికారులకు ఏం చెప్పాలో నాకు తెలుసు. ఏం బయటపడిపోతుందోననే ఆందోళన నాకు లేదు. నా బ్యాంకు ఖాతా వివరాలను ఈడీ అధికారులకు అందిస్తాను. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలమని భావిస్తున్న కెల్విన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఈడీ అధికారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో తప్పులేదు.-తనీష్, యువ నటుడు
ఇదీ చదవండి: సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన హీరో అల్లుఅర్జున్