ప్రముఖ సినీ నటుడు సోనూసూద్.. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై శవాల శివను ప్రశంసించారు. సమాజానికి నిస్వార్ధంగా అంకితభావంతో సేవలందించే శవాల శివ లాంటి వ్యక్తులు... అనేక మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని సోనూసూద్ పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న.. ప్రమాదవశాత్తు పడి మరణించిన వారి మృతదేహాలను .. బయటకు వెలికితీస్తూ శవాల శివగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివ సేవలను ప్రశంసిస్తూ.. పలువురు దాతలు అతనికి ఆర్థిక సాయం చేశారు.

ఆ నగదుతో... మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్ కొనుగోలు చేసిన శవాల శివ... ఆ వాహనాన్ని సోనూ సూద్‌తో ప్రారంభించారు. ట్యాంక్ బండ్ పైన ఉన్న అమ్మవారి ఆలయంలో... శాసనసభ్యుడు ముఠా గోపాల్‌తో కలిసి... సోను సూద్ పూజలు నిర్వహించి... ప్రారంభించారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న శవాల శివను.. యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సోను సూద్ సూచించారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ