ETV Bharat / state

పేదలు ఆక్రమించుకున్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చురుగ్గా కసరత్తు... - telangana lands news

Poor People Housing lands Sorting: పేదలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పురపాలకశాఖ వివరాలను సిద్ధం చేస్తోంది. అయితే పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణకే పరిమితం కావాలా? లేదా గతంలోలా ఇతరులకూ అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై... సీఎం కేసీఆర్​ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Poor People Housing lands Sorting
Poor People Housing lands Sorting
author img

By

Published : Dec 18, 2021, 8:28 AM IST

Poor People Housing lands Sorting: తెలంగాణలో పేదలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో పురపాలకశాఖ వివరాలను సిద్ధం చేస్తోంది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. అధికార యంత్రాంగం గతంలో అమలుచేసిన 166, 58, 59 జీవోల అమలు వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తోంది. పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణకే పరిమితం కావాలా? లేదంటే గతంలోలా ఇతరులకూ అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో సీఎం నిర్ణయం మేరకే ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో గత నెల రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకున్నారు.

దరఖాస్తుల సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా సేకరించారు. దేవాదాయ, వక్ఫ్‌, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖల భూములతో పాటు, కోర్టు కేసుల్లోని భూముల వివరాలు, గ్రామకంఠం భూముల సమాచారాన్ని సర్వే నంబర్ల వారీగా తీసుకున్నారు. తాజాగా వీటిపై ఉన్నతాధికారులు చర్చించగా మంత్రిమండలి ఉపసంఘం పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రూపొందించాల్సిన మార్గదర్శకాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఉన్నవాటితో పాటు కొత్తగా చేర్చాల్సిన అంశాలను పురపాలక, రెవెన్యూ అధికారులు సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: Raithu bandhu: రుణాలతో రైతుబంధు చెల్లింపులు.. ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.