రాష్ట్రంలో నూతన ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆచార్య శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన(sri konda laxman horticulture) విశ్వవిద్యాలయం సవరణ బిల్లుకు శాసనసభలో(Assembly sessions 2021) ఆమోదం లభించింది. తెలంగాణ ఉద్యాన బాంఢాగారంగా అవతరించిన నేపథ్యంలో ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ఏకైక అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి వీలు కల్పించడం జరిగింది. ఫలితంగా ఇక్కడ చదివే విద్యార్థులకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది.
అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు, గుర్తింపు లభించనున్నాయి. దేశంలో... ప్రత్యేకించి తెలంగాణలో ఉద్యాన రంగంలో గల డిమాండ్, అవకాశాల దృష్ట్యా... ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. కోర్సులు పూర్తైన తర్వాత యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాలు స్థాపించడం ద్వారా రాణించవచ్చు. ఇది రాష్ట్రంలోని ఉద్యాన రంగ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. శాసనసభలో(Assembly sessions 2021) శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం - సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(niranjana reddy) ప్రవేశపెట్టగా... ఏకగ్రీవంగా ఆమోదం లభించడం విశేషం.
ఇదీ చదవండి: కళాశాలలోనే విద్యార్థిని తల నరికేసిన ప్రేమోన్మాది