ETV Bharat / state

TSRTC: ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు.. రోడ్డెక్కితే ప్రమాదాలు.! - accident fear in telangana rtc services due to obsolete buses

ఆర్టీసీ అంటేనే ప్రజల్లో నమ్మకం ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతమని ఆర్టీసీ అధికారులు పదేపదే చెబుతుంటారు. నిజమే.. కానీ ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులనే నడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎప్పుడో కొన్న బస్సులనే ఇప్పటికీ నడుపుతున్నారని.. ప్రతి ఏడాది స్క్రాప్ కింద తీసేయాల్సిన బస్సులను తొలగించడంలేదని కార్మికనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతుండటంతో తిరిగి ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.

ts rtc
టీఎస్ఆర్టీసీ
author img

By

Published : Jul 25, 2021, 5:05 PM IST

రాష్ట్రంలోనే ప్రజా రవాణా వ్యవస్థ టీఎస్​ఆర్టీసీలో సుమారు పదివేల పైచిలుకు బస్సులు నిత్యం ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. 'ఆర్టీసీలో ప్రయాణం చేయండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి' అని ఏకంగా ఆర్టీసీ అధికారులే ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్క వారంలోనే రెండు ఆర్టీసీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాటపల్లి వద్ద రాయగిరి మోత్కూర్ ప్రధాన రహదారిపై బస్సు నడుస్తుండగానే ముందు చక్రం ఊడిపోయింది. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

తప్పిన ప్రాణనష్టం

ఇక.. రెండు రోజుల క్రితం జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ ప్రాంతంలో సూపర్ లగ్జరీ బస్సులో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు అంటుకున్నాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న క్రమంలో స్టేషన్​ఘన్​పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పొగ వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించేశారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. కానీ బస్సు పూర్తిగా కాలిపోయింది.

జీతాలు ఇవ్వడమే గగనం

ఆర్టీసీ సంస్థలో మొత్తం 8,357 బస్సులు ఉన్నాయి. అందులో పల్లె వెలుగు, సిటీ ఆర్టీనరీ బస్సులు -4,866, ఎక్స్​ప్రెస్ బస్సులు -1,966, లగ్జరీ, డీలక్స్ బస్సులు- 1,046, ఏసీ బస్సులు -479 వరకు ఉన్నాయి. వీటితో పాటు సుమారు 2,103 అద్దె బస్సులు ఉన్నాయి. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. దీనికి ప్రధాన కారణం.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటమే. 'ఉద్యోగులకు, కార్మికులకు సరైన సమయానికి జీతాలే ఇవ్వలేకపోతున్నాం.. ఇక కొత్త బస్సులు ఎలా కొనుగోలు చేస్తా'మని యాజమాన్యం చెబుతోంది. ఇలాంటి సమయంలో కొత్త బస్సుల కొనుగోలు అనేది అత్యాశే అవుతుందని అధికారులు అంటున్నారు. కానీ.. కార్మికులు మాత్రం కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా.. డొక్కు బస్సులను నడిపితే ప్రయాణికులు ఎలా ఎక్కుతారని ప్రశ్నిస్తున్నారు.

కాగితాలకే పరిమితం

సంస్థ నిబంధనల ప్రకారం ఒక బస్సు జీవిత కాలం అయిన తర్వాత దాని స్థానంలో కొత్త బస్సు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం వాహనాల ఖండన ప్రణాళిక(స్క్రాప్ ప్లాన్), కొత్త బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చుపై ఆర్టీసీ గతంలోనే ఉన్నత స్థాయి అధికారులు ప్రణాళికలు వేసి నివేదికలు కూడా తయారు చేశారు. కానీ.. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప.. అమలు కావడంలేదని ఆర్టీసీ కార్మికనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో 2,885 బస్సులు, 2020లో 605 బస్సులు, 2021లో 823 బస్సులను స్క్రాప్ చేయాల్సి ఉంది. ఆవిధంగా ఇప్పటి వరకు 4,313 బస్సులను స్క్రాప్ చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి 2019లో రూ.865.50 కోట్లు, 2020లో రూ.181.50 కోట్లు, 2021లో రూ.246.90 కోట్లు ఆర్టీసీ సంస్థకు కేటాయించాల్సి ఉంది. కానీ.. ఇప్పటి వరకు గడిచిన మూడేళ్లలో ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సు కొనుగోలు కూడా జరగలేదు. దీంతో పాత బస్సులనే నడుపుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీలో ఒక బస్సు జీవితకాలం 12లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుందని ఆర్టీసీ మెకానిక్​లు చెబుతున్నారు. ఇంజిన్ బాగుంటే మరో రెండు మూడు లక్షల కిలోమీటర్లు తిప్పుకునే అవకాశముంటుందని స్పష్టం చేశారు.

గతంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రతి ఏడాది స్క్రాప్​ చేయాల్సిన బస్సుల జాబితా, ప్రతి ఏడాది నూతన బస్సుల కొనుగోలు కోసం కేటాయించాల్సిన నిధులపై అధ్యయనం చేసిన వివరాలు :

సంవత్సరం మొత్తం బస్సులు రీప్లేస్​మెంట్​కు కావాల్సిన డబ్బు(కోట్లలో)
20192,885 రూ.865.50
2020 605 రూ.181.50
2021 823 రూ.246.90
2022 840 రూ.252.00
2023 764 రూ.229.20
2024 578 రూ.173.40
2025 548 రూ.163.50
2026 485 రూ.145.50
2027 304 రూ.91.20
2028 256 రూ.76.80
2029 272 రూ.81.60
మొత్తం 8,352 రూ.2,507.10

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ వద్ద డబ్బులు లేవు.. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేయూతనిచ్చి... కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తద్వారా ఆర్టీసీకి మరింత ఆదాయం సమకూరుతుందని కార్మికనేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: Bandi sanjay: 'ఎన్నికలొస్తేనే హామీలు.. కులాల పేరిట కుమ్ములాటలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.