మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ ట్రక్ వాహనంలో కూలీలను తరలిస్తున్నారు. కీసర వద్ద అకస్మాత్తుగా టైర్ పేలిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. వాహనంలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నారు. ఘటనలో మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- ఇదీ చూడండి : తెలుగులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు