ప్రజల్లో వ్యతిరేకత చూసే ఏపీలో స్థానిక ఎన్నికలకు వైకాపా వెనుకంజ వేస్తోందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాలని ఈసీ చూస్తుంటే.. వైకాపా నేతలు అడ్డు పడుతున్నారన్నారు. కరోనా వల్ల గతంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఈసీని దుర్భాషలాడారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదొక్కటేనని ఆక్షేపించారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్