ETV Bharat / state

రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ - ఏసీబీకి దొరికిపోయిన షేక్​పేట్​ ఆర్​ఐ

acb-raids on shaikpet ri in hyderabad
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ
author img

By

Published : Jun 6, 2020, 4:14 PM IST

Updated : Jun 6, 2020, 6:07 PM IST

16:10 June 06

రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ

ఒకే కేసులో లంచం తీసుకుంటూ ఆర్​ఐ, ఎస్సై.. అనిశాకు అడ్డంగా దొరికిపోయారు. ఓ భూవివాదం కేసులో బాధితుడి నుంచి భారీగా లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

హైదరాబాద్​ షేక్​పేట్​ తహసీల్దార్​ కార్యాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. షేక్‌పేట ఆర్‌ఐ నాగార్జునరెడ్డిని.. బంజారాహిల్స్​లోని ఒకటిన్నర ఎకరాలకు సంబంధించిన భూమి హద్దులు చూపించాలంటూ ఖలీద్‌ అనే వ్యక్తి ఆశ్రయించాడు. సంబంధిత భూమి... కేసులో ఉండడం వల్ల ఆర్‌ఐ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పరిష్కరించాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. ఈరోజు రూ. 15 లక్షలు... తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో  తీసుకుంటుండగా... అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.  

ఇదే కేసులో ఎస్సై కూడా..

 ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్​లో పనిచేస్తున్న రవీందర్ నాయక్... బాధితుడి నుంచి రూ. 3 లక్షలు డిమాండ్ చేసి రూ. లక్ష 50 వేలు తీసుకున్నాడు. మళ్లీ కేసు నుంచి తప్పించాలంటే మరో రూ. 3 లక్షలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవీందర్ నాయక్​పై కూడా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... దర్యాప్తు చేపట్టారు. షేక్​పేట ఎమ్మార్వో ఇంట్లోనూ... ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Last Updated : Jun 6, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.