ETV Bharat / state

రూ. 50వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికినపోయిన ఎమ్మార్వో

ఇంటి నిర్మాణం విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ.. బాచుపల్లి ఎమ్మార్వో గిరి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

అడ్డంగా దొరికిన ఎమ్మార్వో
author img

By

Published : Aug 23, 2019, 5:05 AM IST

బాచుపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ.. ఎమ్మార్వో గిరి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీనివాసరావు అనే బిల్డర్ తన ఇంటి నిర్మాణం విషయంలో రెవెన్యూ లొకేషన్ ప్లానింగ్ కోసం ఎమ్మార్వోను సంప్రదించగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై శ్రీనివాసరావు గత నెల 31న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఎమ్మార్వోతో పాటు అతని డ్రైవర్ రూ. పదివేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంలో ఉదయం నుంచి బాచుపల్లి కార్యాలయంలో, ఎమ్మార్వో గిరి సొంత ఊరు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సోదాలు నిర్వహించారు. తదుపరి విచారణ నిమిత్తం ఎమ్మార్వో గిరి, అతని డ్రైవర్ అబ్ధుల్ అల్ సయ్యద్​ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అడ్డంగా దొరికిన ఎమ్మార్వో

ఇవీ చూడండి: వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.