ఓ ఇంటి తగాదా విషయంలో ఓ వ్యక్తికి సానుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేశాడు ఓ కోర్టు ఉద్యోగి. రూ.35వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లో ఓ మహిళ ఇంట్లో అరీఫ్ మొయినుద్దీన్ అనే వ్యక్తి గత కొంత కాలంగా అద్దెకు ఉంటున్నాడు. ఇంటిని ఖాళీ చేయమని చెప్పినా.. జాప్యం చేస్తున్నాడు. విసిగిన ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించారు. అద్దెకు ఉంటున్న వ్యక్తిని తక్షణం ఇల్లు ఖాళీ చేయించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.కోర్టు ఉద్యోగి క్రిష్ణ నాయక్ అద్దెకు ఉంటున్న అరీఫ్తో ఇల్లు ఖాళీ చేయించేందుకు కొంత గడువు ఇప్పిస్తానని రూ. లక్ష డిమాండ్ చేశాడు. రూ.75వేలకు ఒప్పందం కుదిరింది. కోర్టు ఆవరణలో లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులకు దొరికిపోయాడు.
ఇవీ చదవండి:రాత్రికిరాత్రే బస్టాప్ మాయం