ETV Bharat / state

అనిశా అదుపులో ఏపీ మాజీ మంత్రి పితాని, మాజీ పీఎస్ - pithani satyanarayana on esi scam

ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ పీఎస్ మురళీ మోహన్​ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.

ex minister pithani ps arrest
ఈఎస్​ఐ కేసు: అనిశా అధికారుల అదుపులో ఏపీ మాజీ మంత్రి పితాని, మాజీ పీఎస్
author img

By

Published : Jul 10, 2020, 7:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఈఎస్ఐ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి పితాని ప్రమేయంపై అనిశా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. పితాని సత్యనారాయణ, మాజీ పీఎస్ మురళీ మోహన్​ని సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన హయాంలోనూ అక్రమాలు కొనసాగినట్లు ఆరోపణలు రావడం వల్ల వాటిపై విచారిస్తున్నారు.

పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్​తో పాటు మురళి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో పెండింగ్​లో ఉంది. శని, ఆదివారాలు న్యాయస్థానం సెలవు ఉంటుంది. ఈ పరిస్ధితుల్లో ముందుగానే మురళిని అనిశా అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని అరెస్టును అనిశా అధికారులు కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఇదీ చూడండి : 'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.