ETV Bharat / state

'మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి' - మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ధర్నా

మంత్రి మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు జేఎన్​టీయూ వద్ద ఆందోళనకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆయనను పదవి నుంచి బర్త్​రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

abvp dharna against minister malla reddy at jntu
'మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Dec 30, 2020, 3:42 PM IST

కూకట్​పల్లిలో జేఎన్​టీయూ పరిపాలన విభాగం కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. న్యాక్​ గుర్తింపు కోసం తప్పుడు పత్రాలను సృష్టించిన మంత్రి మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్​టీయూ అనుబంధంగా ఉన్న... మంత్రి చెందిన కళాశాలల గుర్తింపు పత్రాలను పునః పరిశీలించాలన్నారు. మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి బర్త్​రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం యూనివర్శిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్​కు వినతి పత్రం అందజేశారు. మంత్రి కళాశాలలపై కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ జరుపుతామని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: 'మంత్రి మల్లారెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.