Making Clay Miniature Dolls: ఈ యువతికి చిన్ననాటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే క్లే మినియేచర్ బొమ్మలు తయారు చేయటం నేర్చుకుంది. అలా మంచి చిత్రాలు, అందమైన కళాకృతులతో ప్రతిభ, నైపుణ్యాలు ప్రదర్శిస్తుంది. ఈ మధ్యే.. వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతుంది ఈ యువతి. హైదరాబాద్‌కు చెందిన ఈ యువతి పేరు లక్ష్మీ ప్రసన్న. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రసన్నచిన్నప్పటి నుంచి చదువుతో పాటు.. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ నైపుణ్యాల్లో ప్రతిభ కనబరిచేది.
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్‌ల్లో బీటెక్ చేసిన ఈ యువతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తోంది. అయినా తీరిక దోరికితే చాలు అందమైన కళాకృతులు తయారు చేస్తూ తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంది ఈ యువతి. మంచి వేతనంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడి తాను ఇష్టపడ్డ వ్యక్తిని వివాహాం చేసుకుంది ప్రసన్న. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలోని ప్రతి జ్ఞాపకం ఓ తీపి గుర్తుగా మలుచుకోవాలనుకుంది.
మినియేచర్ రంగంలో రాణించాలనే కోరిక: అలా తనకు ఉన్న నైపుణ్యంతో మినియేచర్ బొమ్మలు తయారు చేసింది. వాటిని పుట్టబోయే బేబికి మంచి గిఫ్ట్స్‌గా ఇవ్వలనుకున్నట్లు చెబుతుంది ప్రసన్న. ప్రసన్నలో ఉన్న భిన్నమైన ప్రతిభ, నైపుణ్యాలు చూసి బంధువులు, మిత్రులు ప్రశంసించే వారు. దాంతో మినియేచర్ రంగంలో రాణించాలనే కోరిక మరింత బలపడింది. అలా ఎవరైనా అడిగితే చిన్న చిన్న బొమ్మలు చేసి ఇచ్చేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతున్న అని అంటుంది ఈ యువతి.
హాబీస్‌ను గుర్తించాలి: ఓ దశలో ఉన్నప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పడింది ప్రసన్న. ఈ సమయంలో తనకు నచ్చిన పని చేయాలనిపించి క్లే మినియేచర్ బొమ్మలు తయారు చేయటం ప్రారంభించింది. హాబీస్‌ను గుర్తించి.. వాటిని నిలుపుకుంటూ రావాలని.. దాని వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారని చెబుతుంది ప్రసన్న. సాధారణంగా పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం.
ఏ ఫంక్షన్స్‌కి అయినా తనదైన శైలిలో మినియేచర్ బొమ్మలు: అలాంటి ఏ ఫంక్షన్స్‌కి అయినా తనదైన శైలిలో మినియేచర్ బొమ్మలు తయారు చేసి వారికి గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుంది ఈ యువతి. ప్రసన్న.. తన కళతో క్లే పేస్టల్స్‌ను తయారు చేస్తోంది. దాని ద్వారా మరో నలుగురికి ఉపాధి కల్పించడమే తన ఉద్దేశ్యం అంటుంది. పెళ్లయ్యాక కూడా తన కాళ్ల మీద తన నిలబడే ప్రయత్నం చేస్తోంది.. అందుకే ఆమె అంటే తనకు చాలా ఇష్టం అంటున్నారు భర్త రామ్. పోటీ ప్రపంచంలో ఉద్యోగం ఒక్కటే సారిపోదు. భవిష్యత్ స్థిరత్వానికి వ్యాపారం, పెట్టుబడులు వంటి ప్రత్యామ్నాయ ఆదాయవనరులు తప్పక అవసరం. అందుకే తన హాబీని మరో ఆదాయం ఇచ్చే మార్గంగా మలుచుకున్నాని చెబుతోంది ప్రసన్న.
"నేను ప్రెగెన్సీతో ఉన్నప్పుడు ప్రతిది ఒక జ్ఞాపకంగా ఉండాలని పుస్తకంలో రాసుకునేదాన్ని. బాబు పుట్టిన తర్వాత అన్నప్రాసనకు సంబంధించిన బొమ్మలు తయారు చేశాను. వాటిని వచ్చిన బంధువులకు, మిత్రులకు ఇవ్వడం జరిగింది. వారు ఎంతగానో బాగున్నాయని అభినందించారు." - లక్ష్మీ ప్రసన్న
ఇవీ చదవండి: ఎస్సై, కానిస్టేబుళ్ల తుది రాతపరీక్షలో తగ్గింపు మార్కులు ఉండవ్..!
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో..!